: రియోలో పతకాలు తీసుకురాని క్రీడాకారులకు శిక్ష విధించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్


రియో ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించి రిక్త హస్తాలతో వెనుదిరిగిన క్రీడాకారులకు ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ శిక్ష సిద్ధం చేశారు. రియో ఒలింపిక్స్ కు వెళ్లే ముందు ఐదు స్వర్ణ, 12 ఇతర (రజత, కాంస్య) పతకాలు తీసుకురావాలని కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా స్పోర్ట్స్ కమీషన్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే రియో ఒలింపిక్స్ లో 9 క్రీడల్లో పాల్గొన్న 31 మంది క్రీడాకారులు రెండు స్వర్ణ, మూడు రజత, రెండు కాంస్య పతకాలు సాధించారు. దీంతో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలిచ్చి, పతకాలు తీసుకురాని క్రీడాకారులను బొగ్గుగనుల్లో పని చేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించనున్నాడని టెలిగ్రాఫ్ కధనం ప్రచురించింది. కిమ్ జాంగ్ ఉన్ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం దక్షిణ కొరియాకు 9 స్వర్ణాలతో 21 పతకాలు రావడమని తెలుస్తోంది. పతకాలు సాధించిన క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లు, చక్కటి రేషన్ సదుపాయం, ఒక కారు, ఇంకా గిఫ్టులు అందించనున్నట్టు తెలుస్తోంది. అలాగే పతకాలు తీసుకురాని క్రీడాకారులకు పెద్దగా సౌకర్యాలు లేని ఇల్లు, రేషన్ తగ్గించడం, బొగ్గుగనుల్లో పనికి పెట్టడం వంటి శిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News