: ఇప్పటికైనా కళ్లు తెరవండి: లంక జట్టుకు అర్జున రణతుంగ సలహా


రానున్న వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరగనున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు కళ్లు తెరవాలని ఆ జట్టు దిగ్గజ ఆటగాడు అర్జున రణతుంగ హెచ్చరించారు. కొలంబోలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించడం గొప్ప విషయమేనని అన్నారు. అయితే ఈ విజయం కేవలం స్పిన్నర్ల ప్రతిభ కారణంగా జట్టును వరించిందని ఆయన చెప్పారు. ఇది స్వదేశంలో బాగుంటుంది కానీ, విదేశాల్లో ఏమాత్రం లాభించదని ఆయన హెచ్చరించారు. లంక జట్టు ప్రతిభను తాను తక్కువ చేయను కానీ, జట్టులో పేస్ బౌలింగ్ వనరులు లేవన్నది వాస్తవమని ఆయన చెప్పారు. పేస్ బౌలర్లు లేకపోతే విదేశాల్లో ఆడడం కష్టమని ఆయన చెప్పారు. వచ్చే వరల్డ్ కప్ నాటికి జట్టులో సరైన పేస్ బౌలర్ లేకపోతే విజయం సాధించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మిడిలార్డర్ బలంగా లేదని ఆయన చెప్పారు. మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News