: అమెరికాలో సౌకర్యాలు ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేదు: కుంబ్లే


క్రికెట్ కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్ లు ఆడబోతోంది. వెస్టిండీస్ జట్టుతో కలిసి ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంకు టీమిండియా చేరుకుంది. ఈ స్టేడియంను పరిశీలించిన చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ఊహించలేదని అన్నారు. క్రికెట్ కు పెద్దగా ఆదరణలేని దేశంలో నిర్వహించే చోట అరొకర సౌకర్యాలుంటాయని ఊహించామని, ఐసీసీ అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని కుంబ్లే పేర్కొన్నారు. ఫ్లోరిడాలో గ్రౌండ్ బాగుంటుందని గతంలో విన్నానని, ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నానని తెలిపారు. ఇక్కడి వికెట్ చూడడం ఇదే మొదటి సారని, అవుట్ ఫీల్డ్ కూడా చాలా బాగుందని కితాబునిచ్చారు. కాగా, రేపు సాయంత్రం తొలి టీ20 మ్యాచ్ ను విండీస్, భారత జట్లు ఫ్లోరిడాలో ఆడనున్నాయి.

  • Loading...

More Telugu News