: రాహుల్ రాజకీయాలు వీడితేనే... కాంగ్రెస్ కు మనుగడ!: గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సుబ్రహ్మణ్యస్వామి సలహా!


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చావు దెబ్బ తిన్నది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ హవాతో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... పార్టీని బతికించే దిశగా చేస్తున్న యత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగాలంటే ఏం చేయాలన్న దిశగా ఆ పార్టీకి సలహాలిచ్చేందుకు బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారు. ఢిల్లీలో నేటి ఉదయం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే... ఉన్నపళంగా రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందేనని స్వామి సలహా పడేశారు.

  • Loading...

More Telugu News