: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వృద్ధులు సంతృప్తికర జీవితం గడపొచ్చట!
సామాజిక మాధ్యమాల ద్వారా వృద్ధులకు మేలు జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. వృద్ధాప్యం బారిన పడిన చాలా మందిలో కలిగే భావన ఒంటరితనం. దీని నుంచి బయటపడటానికి ఫేస్ బుక్, ట్విట్టర్ మొదలైన సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని తమ ఈ-మెయిల్స్ ను చెక్ చేసుకోవడం, ఆత్మీయులతో సంభాషించడం ద్వారా మంచి సంబంధాలు కలిగి ఉంటారని పేర్కొన్నారు. దీని కారణంగా హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు కనుక వారికి ఉంటే వాటిని తగ్గించుకునే అవకాశముంటుందని అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విలియమ్ చొపిక్ పేర్కొన్నారు. సగటు వయసు 68 సంవత్సరాలు ఉన్న 591 మంది నెటిజన్ల అభిప్రాయాలను ఈ సందర్భంగా తెలుసుకున్నామని, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండటం వల్ల సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నామని అందులో 95 శాతం మంది చెప్పారన్నారు. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అప్ డేట్ చేసుకోవడంపై 72 శాతం మంది వృద్ధులు ఆసక్తి చూపుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.