: ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్ కి రంగులు కనిపించవా?
ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్... తన ఫేస్ బుక్ పేజ్ ను బ్లూ కలర్ లో పెట్టడం వెనుక బలమైన కారణం ఉందన్న విషయం మీకు తెలుసా?... చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్క్ జుకెర్ బర్గ్ కు కలర్ బ్లైండ్ నెస్ ఉంది. ఆయన ఎరుపు, ఆకుపచ్చ రంగులను అస్సలు గుర్తించలేరు. అందుకే, తన ఫేస్ బుక్ పేజ్ లో బ్లూ కలర్ ను మాత్రమే పెట్టానని గతంలో ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.