: మాకివ్వాల్సిన నిధులతో సూట్లు కుట్టించుకుంటారా?... ప్రధానిపై దీదీ ఘాటు వ్యాఖ్యలు!


కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కత్తి దూశారు. న్యాయంగా అందాల్సిన నిధుల విషయంలో పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన దీదీ... నేరుగా ప్రధానినే టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులతో ఏం చేసుకుంటారు? సూట్లు కుట్టించుకుంటారా?’’ అని ఆమె మోదీపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయమంటే... నిధులు లేవని ప్రధాని చెబుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో వేలు పెట్టే చర్యలకు కేంద్రం స్వస్తి చెప్పకపోతే... 3 నెలల తర్వాత ఢిల్లీ నడి వీధుల్లో ఆందోళనకు దిగుతామని ఆమె హెచ్చరించారు.

  • Loading...

More Telugu News