: నెట్టింట తెలంగాణ కొత్త జిల్లాల మ్యాపులు!... రెవెన్యూ డివిజన్లు, మండలాల సమగ్ర సమాచారం!


తెలంగాణలో కొత్తగా ఏర్పడనున్న 17 కొత్త జిల్లాలకు సంబంధించిన మ్యాపులు ఇంటర్నెట్ లోకి వచ్చేశాయి. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసిన కేసీఆర్ సర్కారు... కొద్దిసేపటి క్రితం తన అదికారిక వెబ్ సైట్ లో కొత్త జిల్లాల మ్యాపులను విడుదల చేసింది. ఈ మ్యాపుల్లో కొత్త జిల్లాలతో పాటు... జిల్లాల విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర స్వరూపానికి సంబంధించిన మ్యాపులు కూడా ఉన్నాయి. ఈ మ్యాపుల్లో జిల్లాల సరిహద్దులతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న రెవెన్యూ డివిజన్లు, మండలాల నైసర్గిక స్వరూపానికి చెందిన మ్యాపులు కూడా ఉన్నాయి. వెరసి కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాలు సహా మొత్తం 27 జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆ మ్యాపుల్లో కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News