: నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలి: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డిమాండ్
నిర్భయ కేసులో దోషులను వెంటనే ఉరితీయాలని ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. ‘నిర్భయ’ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. జైలు అధికారులు వేధించడం వల్లే వినయ్ శర్మ ఆత్మహత్యకు యత్నించాడంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. కేవలం ఒక్క నిర్భయ కేసులో దోషులకే కాదు, అత్యాచారానికి పాల్పడ్డ ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలని, మరెవరూ అత్యాచారాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాలని స్వాతి కోరారు.