: తిరుపతి జనసేన బహిరంగ సభకు అనుమతి!... ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు!


తిరుపతిలో జనసేన బహిరంగ సభపై సస్పెన్స్ వీడింది. రేపు సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రతినిధి రాఘవయ్య కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. సభకు అనుమతివ్వాలంటూ తాము చేసిన విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సభ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మీ సూచించారని ఆయన తెలిపారు. పోలీసుల నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News