: ‘మహా’ ఒప్పందంపై దీర్ఘకాలిక పోరే!... టీ టీడీపీ కీలక నిర్ణయం!
తెలంగాణలో సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ సర్కారు... మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న కీలక ఒప్పందంపై దీర్ఘకాలిక పోరు సాగించాలని టీ టీడీపీ తీర్మానించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముగిసిన టీ టీడీపీ సమావేశంలో ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రతో కేసీఆర్ సర్కారు చేసుకున్న ఒప్పందం కారణంగా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఇదే విషయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓ లేఖ రాయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.