: బీచ్ లో ముస్లిం మహిళ వలువలు ఊడదీయించిన ఫ్రాన్స్ పోలీసులు... 'బుర్కినీగేట్' వైరల్!
మానవత్వం మంటగలిసిందనండి, లేకుంటే మానవ హక్కుల ఉల్లంఘన అనండి... మరేదైనా అనండి... మీరు ఏమన్నా ఫ్రాన్స్ పోలీసులు చేసిన ఈ పనికి సరిగ్గా సరిపోతుంది. గత నెలలో ఉగ్రదాడి జరిగిన నీస్ పట్టణంలోని సముద్ర తీరంలో మధ్య వయస్కురాలైన ఓ ముస్లిం మహిళ బురఖా ధరించి కూర్చుండగా, ఆయుధాలు, పెప్పర్ స్పేలతో ఆమెను సమీపించిన పోలీసులు బలవంతంగా ఆమె బట్టలు ఊడదీయించి తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆడ పోలీసులు కూడా లేరు. ఇప్పుడు ఆమె చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, బాధితురాలికి బాసటగా నిలిచేలా 'బుర్కినీగేట్' పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ మొదలై వైరల్ అవుతోంది. ఈ ఘటన 23వ తేదీన జరుగగా, పోలీసుల నిర్దయ ఈ చిత్రాల్లో కనిపిస్తోంది. పోలీసుల చర్యలను పలువురు సామాజిక వాదులు తీవ్రంగా విమర్శిస్తుండగా, తమ దేశంలో బురఖాలపై నిషేధం ఉందని పోలీసు వర్గాలు తమ చర్యను సమర్థించుకుంటున్నాయి.