: వెలగపూడిలో తలుపులు తెరచుకున్న వైద్య ఆరోగ్య శాఖ


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఏపీ ప్రభుత్వ శాఖల తరలింపు కొనసాగుతోంది. ఇప్పటికే కీలక ప్రభుత్వ శాఖలు దాదాపుగా తరలిపోగా... తాజాగా కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కూడా అక్కడ కార్యాలయం తెరచేసింది. తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటైన ఆ శాఖ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో సర్కారీ వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News