: చెన్నయ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాన్సలర్ అరెస్ట్
చెన్నయ్ లో ఇంజనీరింగ్, మెడికల్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న 'ఎస్ఆర్ఎం' యూనివర్శిటీ చాన్సలర్ పచ్చముత్తును చెన్నై సీఐడీ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఆయన్ను సైదాపేట న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. పచ్చముత్తు సన్నిహితుడు మదన్ నెల రోజులుగా అదృశ్యమైన నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పచ్చముత్తుపై చీటింగ్, కిడ్నాప్ కేసులను నమోదు చేసిన పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకుని కేసును మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, విభజన అనంతరం విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కోసం ఏపీ రాజధాని అమరావతిలో 200 ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.