: టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బులిటెన్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఈరోజు దీనిపై వాదనలు వింది. టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపించారు. దీనిపై అభ్యంతరాలు, వివరణలు లిఖితపూర్వకంగా అందించాలని అదనపు ఏజీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణను సెప్టెంబరు 2 (వచ్చే శుక్రవారం)కి వాయిదా వేసింది.