: సింధును గుజరాత్‌కు ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తాం: హైద‌రాబాద్‌లో గుజరాత్ సీఎం


బ్రెజిల్‌లోని రియో డి జ‌నీరోలో ఇటీవ‌లే ముగిసిన ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన భార‌త‌ బ్యాడ్మింటన్ స్టార్‌, తెలుగు తేజం పి.వి సింధును ఇప్ప‌టికే ఇరు తెలుగు రాష్ట్రాలు ఘ‌నంగా స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. త్వరలోనే గుజరాత్‌లోనూ ఆమెను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌న్మానించనుంది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాని ఈరోజు హైద‌రాబాద్‌లో తెలిపారు. హైటెక్‌సిటీలో జరుగుతోన్న గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి కుమారుని వివాహానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... సింధుని గుజ‌రాత్‌కి ఆహ్వానిస్తామ‌న్నారు. త‌మ స‌ర్కారు తరఫున భారత బ్యాడ్మింటన్ స్టార్ ను ఘనంగా సత్కరిస్తామని చెప్పారు. ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీ పాలనకు జేజేలు కొడుతున్నార‌ని, త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజయం సాధిస్తుంద‌ని ఆయ‌న అన్న‌ారు.

  • Loading...

More Telugu News