: రాజన్ కు ఎకనామిక్స్ లో డిగ్రీ కూడా లేదట!... సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణ!


వివాదాస్పద కామెంట్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి... భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్న రాజన్ కు కనీసం ఎకనామిక్స్ లో డిగ్రీ కూడా లేదని ఆయన ఆరోపించారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్ఐ’తో మాట్లాడిన సందర్భంగా రాజన్ పై సుబ్రహ్మణ్యస్వామి విరుచుకుపడ్డారు. ‘‘ఆర్బీఐ గవర్నర్ గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేశారు. యాలే వర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్ కు ఎకనామిక్స్ లో కనీస డిగ్రీ కూడా లేదు. ఇంజినీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్ మెంట్ విద్యనభ్యసించిన రాజన్... ఎకనామిక్స్ లో కనీస విద్యార్హత కూడా సాధించలేదు’’ అని స్వామి ఆరోపించారు.

  • Loading...

More Telugu News