: ఒంగోలులో తెలంగాణ సిట్!... నయీమ్ బంధువు సలీం ఫ్లాట్ తాళం బద్దలు కొట్టిన వైనం!


గ్యాంగ్ స్టర్ నయీమ్ దందా ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. విశాఖ లాంటి ఏపీలోని ప్రధాన నగరాలతో పాటు ఒంగోలు లాంటి చిన్న నగరాలకు కూడా అతడి దందా విస్తరించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రంగా ఉన్న ఒంగోలులో ప్రస్తుతం తెలంగాణ సిట్ అధికారులు ముమ్మర సోదాలు ప్రారంభించారు. నిన్న రాత్రికే ఒంగోలు చేరుకున్న సిట్ అధికారులు నేటి ఉదయం నయీమ్ సమీప బంధువు సలీం నివాసముంటున్న ఫ్లాట్ ను గుర్తించారు. నగరంలోని మంగమూరుడొంకలోని ఓ అపార్ట్ మెంటులో సలీం నివాసమున్నట్లుగా భావిస్తున్న ఫ్లాట్ కు తాళం ఉండటాన్ని సిట్ గుర్తించింది. సిట్ అధికారులు వస్తున్నారన్న సమాచారంతోనే సలీం పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు ఫ్లాట్ కు ఉన్న తాళాన్ని బద్దలుకొట్టిన సిట్ అధికారులు సదరు ఫ్లాట్ లో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News