: వినోద్ రాయల్ హత్యలో కొత్త కోణం!... అమెరికా వీసాను ఓర్వలేకే చంపేశారంటున్న అభిమాని తల్లి!


టాలీవుడ్ యంగ్ హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయల్ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మా హీరో గొప్ప అంటే... కాదు మా హీరో గొప్ప అంటూ కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఘర్షణలో వినోద్ రాయల్ చనిపోయినట్లు కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ నిన్న తిరుపతి వెళ్లిన సందర్భంగా బాధితుడి తల్లి ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. కేవలం స్టార్లపై ఉన్న అభిమానమే తమ కుమారుడి హత్యకు కారణం కాదని ఆమె పవన్ కల్యాణ్ కు చెప్పారు. కర్ణాటకలో తమ కుమారుడికి కొంతమంది స్నేహితులున్నారని చెప్పిన ఆమె... వినోద్ కు అమెరికా వీసా రావడంతో వారంతా ఓర్వలేక హత్య చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News