: ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డికి తప్పిన ప్రమాదం
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కాసు కృష్ణారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలంలో ఆయన పర్యటిస్తున్న కారు వేగంగా వెళుతుండగా, ఓ మలుపులో ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా అడ్డు వచ్చింది. కారును చూసిన ఆర్టీసీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. అప్పటికే కాసు కృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం బస్సు కుడివైపున రాసుకు వెళ్లింది. తమ డ్రైవర్ చాకచక్యం కూడా తనను ప్రాణాలతో నిలిపిందని వ్యాఖ్యానించిన కాసు, అనంతరం అదే వాహనంలో వెళ్లిపోయారు.