: స్వలింగ సంపర్కులపై మరుగుతున్న నీళ్లు పోసిన వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష‌


అమెరికాలోని అట్లాంటాలో ఓ వ్య‌క్తి స్వ‌లింగ సంప‌ర్కులు నిద్ర‌లో ఉండ‌గా వారిపై దాడి చేశాడు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు తాజాగా ఆ వ్య‌క్తికి 40 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఆంథోని గూడెన్, అతడి భాగస్వామి మార్క్వెజ్ టొల్బెర్ట్ పై మార్టిన్ బ్లాక్వెల్ అనే వ్యక్తి మ‌రుగుతున్న నీళ్లు పోశాడు. దీంతో వారిద్ద‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. దీంతో చాలా రోజులుగా వారు ఆసుప‌త్రిలోనే ఉండాల్సి వ‌చ్చింది. ఆంథోని గూడెన్ త‌ల్లితో మార్టిన్ బ్లాక్వెల్ గ‌త మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే గూడెన్ గురించి తెలుసుకున్న బ్లాక్వెల్ విద్వేషంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. తీవ్ర‌గాయాల‌తో తాము ఎంతో బాధ‌ను అనుభ‌వించామ‌ని స్వ‌లింగ సంప‌ర్కులు ఆంథోని గూడెన్, మార్క్వెజ్ టొల్బెర్ట్ కోర్టులో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమారుడిపై తన ప్రియుడు దాడి చేయడాన్ని గూడెన్ త‌ల్లి కూడా ఖండించింది.

  • Loading...

More Telugu News