: బీమా సొమ్ము కోసం చేయి, కాలు తీయించేసుకున్న మహిళ!


‘డబ్బు మాత్రమే కావాలి.. దాని కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మే’.. ఇదే ధోర‌ణితో తామేం చేస్తున్నారో తమకే తెలియకుండా దుస్సాహసానికి దిగుతున్నారు. ఒళ్లు వంచ‌కుండా ల‌క్ష‌ల రూపాయలు సంపాదించాల‌నే ఆశ‌తో శరీర అవ‌య‌వాల‌ను కూడా అమ్మేసుకొని సొమ్మును చేసుకుంటున్న వారిని ఇంత‌వ‌ర‌కు చూశాం. వియ‌త్నాంలో మాత్రం ఓ మ‌హిళ‌ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయని ప‌నిని చేసింది. 'ఎట్టీఎన్' అనే 30 ఏళ్ల మహిళ బీమా సంస్థ నుంచి డ‌బ్బు తీసుకోవాల‌నే ఆశ‌తో త‌న చేయి, కాలు తీయించేసుకుంది. చివ‌రికి ఆమె చ‌ర్య‌ను తెలుసుకున్న వారంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. బీమా సంస్థ నుంచి కోటిన్నర రూపాయలు తీసుకోవాల‌ని ఆశ‌ప‌డి త‌న స్నేహితుడి సాయంతో ఎట్టీఎన్ ఈ ప‌నిచేసింది. త‌న కాలు, చేతులు తీయించుకొని బీమా సంస్థను త‌న‌కు డ‌బ్బు ఇవ్వాల‌ని కోరింది. రైలు ప్రమాదం నుంచి త‌న‌ను 'డీ' అనే త‌న‌ స్నేహితుడు కాపాడని పేర్కొంది. అయితే దీనిపై ఆరా తీసిన పోలీసుల‌కు ఆమె తన స్నేహితుడికి రూ.లక్షన్నర ఇస్తానని చెప్పి ఇలా చేయించుకొని బీమా సంస్థ‌ను ఆశ్ర‌యించింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఆమె హనోయ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. డ‌బ్బు కోసం కాలు, చేయి కోల్పోయిన ఆ మ‌హిళ చ‌ర్య‌ను చూసి అంతా విస్తుపోయారు.

  • Loading...

More Telugu News