: మొగదిషు రెస్టారెంట్‌పై ఆల్ ఖాయిదా ఉగ్రదాడి
సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్ రెస్టారెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. సెక్యూరిటీ దళాలు, ఉగ్రవాదికి మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఆల్ ఖాయిదా అనుబంధ షబాబ్ గ్రూపు ప్రకటించింది. మొగదిషులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన బనాడిర్ బీచ్ రెస్టారెంట్ సోమాలియా అధికారులు, యువతతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. దీంతో ఈ రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అందులోకి చొరబడి కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు అక్కడికి సమీపంలో బాంబులు నింపిన కారుతో ఓ బిల్డింగ్‌పై దాడిచేసినట్టు అధికారులు తెలిపారు.