: ఇంద్రాణి కేసులో మరో ట్విస్ట్... షీనా కనిపించకుంటే ఏమవుతుంది? ఎందుకీ సోది గోల?: కొడుకు రాహుల్ తో పీటర్ ఫోన్ సంభాషణ


గత ఏడాది భారత కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కొత్త అంశాలు సీబీఐ విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చాయి. షీనా హత్య గురించి ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసునని, షీనాను ప్రేమించిన పీటర్ కుమారుడు రాహుల్ తో పీటర్ మాట్లాడి ఆమె అదృశ్యంపై సర్దిచెప్పాడని సీబీఐ ఆధారాలు సంపాదించింది. ఈ మేరకు పీటర్, రాహుల్ మధ్య జరిగిన 20 ఫోన్ సంభాషణల్లో ఏడింటి వివరాలను చార్జ్ షీట్లో పొందుపరిచింది. అందులో ఒక కాల్ లో "ఆమె (షీనా) మాయం అయితే ఏంటి? ఎందుకీ సోది గోల చేస్తున్నావు" అని పీటర్ అన్నట్టుగా ఉంది. ఆనాటి సంభాషణలను రాహుల్ తన సెల్ ఫోన్లో రికార్డు చేయగా, సీబీఐ వాటిని సేకరించి, పీటర్ కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న సాక్ష్యాల్లో చేర్చింది. షీనా హత్యకు గురైన తరువాత, తనను వదిలి వెళ్లిందని రాహుల్ భావిస్తుంటే, పీటర్ ఎలా సముదాయించాలని ప్రయత్నించాడో ఈ సంభాషణల్లో ఉన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరో సంభాషణలో రాహుల్ ఆవేశంగా "ఆమె ఎక్కడుందో నాకు తెలియాల్సిన అవసరం లేదు. కనీసం ప్రాణాలతో ఉందా?" అని అరుస్తూ మాట్లాడినట్టు ఉండగా, మరో కాల్ లో "ఇక ఆమె గురించి పూర్తిగా వదిలెయ్" అని పీటర్ అన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News