: అల్ఫా గ్రహం పేరు 'అల్బర్టన్‌ అలౌదా'


సౌరకుటుంబం కాకుండా.. ఇప్పటిదాకా మన భూమండలానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న అతి దగ్గరి గ్రహం 'అల్ఫా సెంటారీ బీబి'!! ఈ కొత్త గ్రహానికి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పేరేమీ పెట్టలేదు. అయితే అంతరిక్షంలోని వస్తువులకు పేరుపెట్టే అధికారం, అర్హత మాకే ఉంది అంటూ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రకటించింది. అలాంటి ప్రకటన వచ్చిన రెండు వారాల తర్వాత ఉవింగ్‌ అనే సంస్థ ఈ గ్రహానికి పేరుపెట్టడంపై ప్రజాభిప్రాయం సేకరించే పోల్‌ నిర్వహించింది.

ఉవింగ్‌ అనేది అంతరిక్ష యాత్ర ఆర్థిక సహాయ సంస్థ. వీరు సొమ్ము చెల్లించి మరీ.. కొత్త గ్రహానికి పేరు పెట్టాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తుల్ని ఆహ్వానించారు. కొత్త పేరు సూచించేవాళ్లు 4.99 డాలర్లు చెల్లించి పేరును ప్రపోజ్‌ చేయొచ్చు. ఓటు వేసేవాళ్లు 0.99 డాలర్లు చెల్లించాలి. ఇలా వసూలయ్యే మొత్తాన్ని ఉవింగ్‌ సంస్థ.. అంతరిక్ష యాత్ర పరిశోధకుల సంక్షేమానికి వినియోగిస్తుంది. ఎంట్రీలు చాలానే వచ్చినప్పటికీ.. అత్యధికంగా 751 ఓట్లు సాధించిన పేరు మాత్రం 'అల్బర్టన్‌ అలౌదా' అనే పేరు. జేలార్క్‌ దీన్ని సూచించారు. ఆ పదానికి అర్థం.. 'కీర్తించండి' అని ఉంటుందిట.

మొత్తానికి ఆ రూపంలో అధికారికంగా కాకపోయినా సరే.. అల్ఫా గ్రహానికి ప్రజలు మెచ్చిన పేరు ఒకటి 'అల్బర్టన్‌ అలౌదా' గా చెలామణీ లోకి వచ్చిందన్నమాట.

  • Loading...

More Telugu News