: రూ. 1.9 కోట్ల మోసం కేసులో హృతిక్ రోషన్ మాజీ భార్యకు ఊరట


తమను రూ. 1.9 కోట్లకు మోసం చేసిందంటూ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ పై గోవా నిర్మాణ రంగ సంస్థ ఎంజీ ప్రాపర్టీస్ వేసిన చీటింగ్ కేసును బాంబే హైకోర్టు కొట్టేసింది. రెండు నెలల క్రితం కేసు దాఖలు కాగా, ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ లో మోసం చేసినట్టు ఎక్కడా లేదన్న సుసానే న్యాయవాదులు నితిన్ సర్దేశాయ్, హితీష్ జైన్ ల వాదనలతో న్యాయమూర్తులు ఎఫ్ఎం రేసి, నూతన్ లు ఏకీభవించారు. ఎఫ్ఐఆర్ లో వ్యతిరేక అభిప్రాయాలు లేనప్పుడు కేసు నిలవదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తుల బెంచ్ సుసానేకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది కేవలం సివిల్ కేసు కాగా, ఎంజీ ప్రాపర్టీస్ సంస్థ పోలీసుల సాయంతో క్రిమినల్ కేసుగా మార్చాలని చూసిందని సుసానే తరఫు న్యాయవాది ఆరోపించారు.

  • Loading...

More Telugu News