: మరో 4 స్మార్ట్ ఫోన్ కంపెనీలకు విస్తరించిన రిలయన్స్ జియో ఉచిత ఆఫర్
ఇప్పటికే శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ సహా పలు కంపెనీల స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన రిలయన్స్ జియో ఉచిత 4జీ సిమ్ ఆఫర్ మరికొన్ని కంపెనీలకూ విస్తరించింది. జియోనీ, కార్బన్, లావా, క్సోలో సంస్థలు విక్రయించిన మొబైల్ ఫోన్లపైనా తమ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్లు ఉన్న వారెవరైనా తమ సిమ్ తీసుకుని వాడుకోవచ్చని తెలిపింది. జియోనీలో ఇటీవల విడుదలైన ఈ8, ఎఫ్ 103 ప్రో, ఎం4, ఎం5, ఎం5 లైట్, ఎం5 ప్లస్, పీ5ఎల్, కార్బన్ విక్రయించిన ఓరా 1, క్వాత్రో ఎల్ 45, క్వాత్రో ఎల్ 50 హెచ్డీ తదితర ఫోన్లు, లావా తయారు చేసిన ఏ71, ఏ 72, ఏ 76 ప్లస్, పిక్సెల్ వీ2, వీ2ఎస్, ఎక్స్ 10, ఎక్స్ 11, ఎక్స్ 50 ప్లస్ తదితర ఫోన్లుంటే రిలయన్స్ జియో సిమ్ తీసుకోవచ్చు. క్సోలోకు చెందిన బ్లాక్ 1ఎక్స్ ఎం, ఏరా 1ఎక్స్, ఏరా 2ఎక్స్, ఏరా 4జీ తదితర వెరైటీలున్నా సిమ్ పొందవచ్చు.