: బిగ్ షాట్లతో భోజనం.. మూడు రోజుల్లో 18 మిలియన్ డాలర్లు సేకరించిన హిల్లరీ


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మూడు రోజుల్లో 18 మిలియన్ డాలర్ల నిధులు సేకరించారు. ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు సేకరిస్తున్న హిల్లరీ తాజాగా గంటకు దాదాపు 2,70,000 డాలర్ల చొప్పున మూడు రోజుల్లో ఏకంగా 18 మిలియన్ డాలర్లు సేకరించారు. హాల్ ఆఫ్ ఫేమ్ బాస్కెట్‌బాల్ ఆటగాడు మ్యాజిక్ జాన్సన్, యాపిల్ సీఈవో టిమ్‌కుక్, నటుడు జస్టిన్ టింబర్‌లేక్ తదితరులను హిల్లరీ కలిశారు. అలాగే కాలిఫోర్నియాలోని సంపన్న కుటుంబాలతో కలిసి డిన్నర్ చేయడం ద్వారా ఈ నిధులను పోగేశారు. 2013లో బరాక్ ఒబామా కూడా ఇవే కుటుంబాలతో కలిసి భోజనం చేసి నిధులు సేకరించారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి ఆయన మీడియా ప్రతినిధులను అనుమతించగా హిల్లరీ మాత్రం వారికి అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News