: మాపై 'బ్రహ్మోస్' గురిపెడతారా? చైనా ఆగ్రహం!


అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులను మోహరించడాన్ని చైనా తప్పుబట్టింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేలా నిర్ణయాలు తీసుకునే బదులు శాంతిని పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరింది. స్వీయ రక్షణ కోసం ఈ క్షిపణులను మోహరించినట్టు ఇండియా స్పష్టం చేయగా, తమను భయపెట్టాలని ఇండియా భావిస్తోందని చైనా వ్యాఖ్యానించింది. బ్రహ్మోస్ మోహరింపుపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కియాన్ స్పందిస్తూ, "భారత ప్రభుత్వం సరిహద్దుల్లో శాంతిని, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. అవతలి వైపున్న దేశాలను భయపెట్టాలని చూస్తే ప్రయోజనాలుండవు" అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో చైనా వైపు నుంచి చొరబాట్లు పెరగడం పలుమార్లు పీపుల్స్ ఆర్మీ సరిహద్దులు దాటి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సెక్యూరిటీని పెంచాలని నిర్ణయించిన మోదీ సర్కారు సూపర్ సానిక్ మిసైల్ బ్రహ్మోస్ లను సరిహద్దులకు పంపింది. దాదాపు 300 కిలోల పేలుడు పదార్థాలను తీసుకువెళ్లగల ఈ క్షిపణులను 2007 నుంచి ఇండియా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News