: అమెరికాలో ఆటకు వేళాయె!... ఫ్లోరిడాలో టీమిండియా!


ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పాటు అమెరికాకు పొరుగున ఉన్న కెనడాలో కూడా క్రికెట్ ఆడిన భారత జట్టు, ఇప్పుడు తొలిసారిగా ఫ్లోరిడా వేదికగా క్రికెట్ ఆడనుంది. వెస్టిండీస్ తో జరిగే రెండు టీ-20 పోటీలు శని, ఆదివారాల్లో ఇక్కడి లాడర్ హిల్ స్టేడియంలో జరుగనున్నాయి. సంప్రదాయ క్రికెట్ గ్రౌండ్ కానప్పటికీ, ఈ పోటీల కోసం మైదానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వెస్టిండీస్ పర్యటన అనంతరం అక్కడి నుంచి కోహ్లీ వంటి ఆటగాళ్లు ఫ్లోరిడాకు చేరుకోగా, కెప్టెన్ ధోనీతో పాటు టీ-20 స్పెషలిస్టు ఆటగాళ్లు ఇండియా నుంచి యూఎస్ చేరుకున్నారు. అశ్విన్, శిఖర్ ధావన్ తదితరులు మియామీ హీట్స్ బాస్కెట్ బాల్ జట్టును కలసి వారితో సరదాగా బాస్కెట్ బాల్ ఆడారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30)కు మ్యాచ్ మొదలవుతుంది. కాగా, వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ లు జరుగనుండగా, కనీసం ఒకటి గెలిస్తేనే భారత్ ప్రస్తుతం అనుభవిస్తున్న టాప్-2 ర్యాంకు నిలిచివుంటుంది. రెండూ ఓడిపోతే మాత్రం మూడో స్థానానికి పరిమితమవుతుంది.

  • Loading...

More Telugu News