: బుధవారం నుంచి అమల్లోకి... 92 పైసలకు రూ. 10 లక్షల రైల్వే బీమా


రైల్వేల్లో ప్రయాణించే అన్ని ఖరారైన, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టు జాబితాలోని టికెట్ దారులకు, అన్ని తరగతుల ప్రయాణికులకు కేవలం 92 పైసల అదనపు చెల్లింపుతో రూ. 10 లక్షల బీమా దగ్గర కానుంది. ఈ కొత్త పథకం 31వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఐఆర్సీటీసీ నుంచి బుక్ చేసుకునే టికెట్లపై మాత్రమే ఈ సదుపాయం వర్తించనుండగా, త్వరలోనే రైల్వే కౌంటర్ల ద్వారా కొనుగోలు చేసే టికెట్లపైనా ఇదే సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇందులో భాగంగా, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినా, పూర్తి వికలాంగులైనా రూ. 10 లక్షలు, పాక్షికంగా అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రిలో చేరితే రూ. 2 లక్షలు, మృతుల కుటుంబాలను సొంత ప్రాంతానికి తరలించేందుకు రూ. 10 వేలను బీమా కింద అందిస్తారు. ఇతర రైల్వే ప్రమాదాలపైనా బీమా వర్తిస్తుంది. ఉగ్రవాద దాడి, బందిపోటు దోపిడీలు, అల్లర్లు, అగ్ని ప్రమాదాలు వంటి వాటిపైనా బీమా వర్తిస్తుంది. కాగా, ఐదేళ్లలోపు పిల్లలతో పాటు ఫారినర్స్, సబర్బన్ రైలు ప్రయాణికులకు బీమా వర్తించదు. టికెట్ రద్దుపై ప్రీమియం తిరిగి చెల్లింపులు కూడా ఉండవని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News