: చిరు, కాజల్ షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్


మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు ఈ చిత్రం షూటింగ్ జరిగింది. చిరంజీవి, కాజల్ పై ఒక కీలక సన్నివేశాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు వివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు.

  • Loading...

More Telugu News