: 830 సైట్లను తాత్కాలికంగా మూయించిన బాలాజీ మోషన్ పిక్చర్స్
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమా ఏది విడుదలైనా... దాని విడుదలకు ముందుగానే ఆన్ లైన్ లో ఆ సినిమా ప్రత్యక్షమవుతోంది. దీంతో ‘ఏ ఫ్లైయింగ్ జాట్’ బాలీవుడ్ సినిమా నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీనిని నిర్మించిన బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ న్యాయస్థానంలో కేసు వేసింది. బాలీవుడ్ సినిమాల పైరసీ కాపీలను ఉంచుతున్న 830 వెబ్ సైట్ల వివరాలను మద్రాసు హైకోర్టు ముందు ఉంచింది. తమ సినిమా ధియేటర్లలో విడుదల చేసేంత వరకు ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేయించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ 830 సైట్లను బ్లాక్ చేయించింది.