: రేషన్, పెన్షన్ ఎక్కడి నుంచైనా తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
రేషన్, పెన్షన్ దారులు ఎక్కడి నుంచైనా వాటిని తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక నెలలో పెన్షన్, రేషన్ అందకపోయినా మరుసటి నెలలో రెండు నెలలవి కలిపి ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ కరెంట్ మీటర్ రీడింగ్ అందుబాటులోకి వస్తుందని, నేరుగా ఉపాధి కూలీల అకౌంట్లలోనే డబ్బు జమ చేస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆటోమేషన్ విధానం వల్ల అక్రమాలకు చెక్ పెట్టవచ్చన్నారు. డ్రోన్ల ద్వారా రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో చూడవచ్చని, చైనాలో అన్ని పనులు సెల్ ఫోన్ ద్వారానే చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.