: సిల్వర్ మెడల్ సాధించినా సింధు ర్యాంక్ లో మార్పు లేదు


రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు వరల్డ్ ర్యాంకింగ్ లో ఏమాత్రం మార్పు లేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో సింధు 10వ ర్యాంకులోనే కొనసాగుతోంది. కాగా, ప్రముఖ షట్లర్ సైనా సెహ్వాల్ ర్యాంకు మాత్రం పడిపోయింది. రియో ఒలింపిక్స్ లో తన ఆట తీరు కారణంగా నాలుగు పాయింట్లు కోల్పోయిన సైనా 9వ ర్యాంకులో నిలిచింది. షట్లర్లు గుత్తా జ్వాలా, అశ్వని పొన్నప్ప ర్యాంకులు కూడా పడిపోయి 26వ స్థానంలో ఉన్నారు. అయితే, షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అజయ్ జయరాంలు తమ ర్యాంకులను మెరుగుపరచుకుని వరుసగా 10, 22వ స్థానాల్లో నిలిచారు.

  • Loading...

More Telugu News