: డబ్బు సంపాదించాలనే డాన్సర్ గా పని చేశాను... సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి: ముమైత్ ఖాన్


డబ్బు సంపాదించాలన్న తపనతో డాన్సర్ గా కెరీర్ ప్రారంభించానని ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ తెలిపింది. తాను రెమో డిసౌజా టీంలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్నని చెప్పింది. మున్నాభాయ్ సినిమాలో పాట కోసం ఆడిషన్ కు వెళ్లానని, అయితే అదృష్టం కలిసివచ్చి ఐటెం సాంగ్ కు సెలెక్ట్ అయ్యానని, అప్పటి నుంచి అవకాశాలు వెల్లువెత్తాయని, దాంతో డబ్బు కోసం శ్రమపడాల్సిన అవసరం రాలేదని చెప్పింది. ఐటెం గర్ల్ గా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడంతో అవకాశాలు వచ్చాయని, వాటితో పాటు బోలెడంత పేరు ప్రతిష్ఠలు కూడా వచ్చాయని తెలిపింది. అయితే తన ఇంట్లో వాళ్లు మాత్రం తనను ముమైత్ ఖాన్ గా గుర్తించడం లేదని, ఇంకా మామూలు అమ్మాయిగానే చూస్తున్నారని చెప్పింది. ఇంటి బయటకు వస్తే తాను ముమైత్ ఖాన్ కానీ, ఇంట్లో ఉంటే మామూలు అమ్మాయినేనని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News