: ఐఐటీ-బాంబే లో ఆ సంస్థల క్యాంపస్ రిక్రూట్ మెంట్లపై నిషేధం!


క్యాంపస్ రిక్రూట్ మెంట్లు నిర్వహిస్తూ తమ విద్యార్థులకు అధిక వేతనాలతో జాబ్ ఆఫర్లు చేస్తున్న కొన్ని కంపెనీలు ఆయా విద్యార్థులను ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంలో జాప్యం చేస్తుండం, ఫేక్ కంపెనీల వంటి సంఘటనలను ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ-బాంబే సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో 9 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ సందర్భంగా ఐఐటీ-బాంబే అధికార ప్రతినిధి ఫల్గుణి బెనర్జీ నేహ మాట్లాడుతూ, తమ సంస్థలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లు నిర్వహించిన 9 కంపెనీలు, విద్యార్థులను ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో ఆలస్యం చేస్తున్నాయన్నారు. ఈ కంపెనీలు ఏడాది పాటు తమ సంస్థలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉండేలా వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. జీపీఎస్ కే, జాన్సన్ ఎలక్ట్రిక్ ఆఫ్ చైనా, పోర్టీ మెడికల్, పెప్పర్ టాప్, క్యాష్ కేర్ టెక్నాలజీస్, ల గార్ద్ బర్నెట్ గ్రూప్, మెరా హునార్ లు ఆ జాబితాలో ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News