: పబ్లిసిటీ కోసమే నట్టి కుమార్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు!: సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ


తెలుగు సినీ పరిశ్రమపై ఓ నలుగురైదుగురు వ్యక్తులు బురదజల్లుతుంటారని ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 2,000 మంది వరకు నిర్మాతలు ఉన్నారని అన్నారు. వారిలో తప్పుడు పనులు చేసేవారు ఎంతమందని ఆయన ప్రశ్నించారు. సినీ పరిశ్రమ అయినా, వ్యాపార, రాజకీయ వర్గాలైనా, ఇతర రంగాల్లో అయినా తప్పుడు పనులు చేసేవారు ఉంటారని ఆయన చెప్పారు. నయీం పేరు తాను తొలిసారి వింటున్నానని ఆయన చెప్పారు. పబ్లిసిటీ కోసం నట్టి కుమార్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిర్మాతల మండలిలో గత పదేళ్లలో 59,38,000 రూపాయల అవకతవకలు జరిగాయని ఆయన అంగీకరించారు. ఆడిట్ నిర్లక్ష్యం ఉందని కేసు పెట్టామని, శేఖర్ బాబు, జానకీరాంపై కేసు పెట్టి రెండు నెలల దాటిందని ఆయన చెప్పారు. ఈ మొత్తంలో ఎవరు ఎక్కువ తిన్నారన్నది తెలియాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వారు చెల్లిస్తానని అంగీకరించారని ఆయన తెలిపారు. నట్టి కుమార్ ఆరోపణలపై అశోక్ కుమార్ పోలీస్ కేసు పెడతామని అన్నారు. వ్యక్తిగతంగా బురదజల్లడం సరికాదని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News