: అట్టహాసంగా టీపీఎల్ పోటీలు ప్రారంభం...ఐపీఎల్ ను తలపిస్తున్న టీపీఎల్


తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను తలపించేలా టీపీఎల్ వేడుకలు జరగడం విశేషం. ఈ వేడుకల్లో సినీ నటి శ్రియ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాజీ ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ టీపీఎల్ ను నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ లో నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఐపీఎల్ లో అరంగేట్రం చేసేనాటికి ప్రతిభావంతులైన తమిళనాడు క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా టీపీఎల్ కు ఆయన రూపకల్పన చేశారు. దీంతో ఈ లీగ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News