: రాహుల్ యు టర్న్ తీసుకోలేదు: దిగ్విజయ్ సింగ్
ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారని, యూటర్న్ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందన్న రాహుల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఆయనపై పరువునష్టం కేసు వేశారని అన్నారు.