: ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై యువతి దాడి
ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై యువతి దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మార్కాపురంలోని మైస్ కోచింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దాడిలో యువకుడి తలకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు.