: సబితా ఇంద్రారెడ్డికి భద్రత తగ్గింపుపై ఇంటలిజెన్స్ ఐజీతో మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ సర్కారు షాక్ ఇస్తూ మాజీ హోం మంత్రి హోదాలో ఆమెకు ఏర్పాటు చేసిన భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆమెకు భద్రత తగ్గింపుపై ఇంటలిజెన్స్ ఐజీతో ఆయన ఈరోజు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఐజీకి పలు విషయాలు తెలిపిన ఆయన.. భద్రతను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.