: సింధు, సాక్షి, కర్మాకర్ లకు ఐఆర్సీటీసీ అరుదైన గౌరవం


రియో ఒలింపిక్స్ లో రజత, కాంస్య పతకాలను సాధించిన క్రీడాకారులు పీవీ సింధు, సాక్షి మాలిక్ లకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అరుదైన గౌరవాన్ని కల్పించింది. లగ్జరీ టూరిజం ట్రెయిన్ మహారాజ ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణించేలా వారికి అవకాశం కల్పించింది. ఈ ఇద్దరితో పాటు ‘రియో’లో జిమ్నాస్టిక్స్ ఫైనల్ కు వెళ్లిన దీపా కర్మాకర్ కు కూడా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరైక్టర్ ఏకే మనోకా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సింధు, సాక్షి, కర్మాకర్ కు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News