: 70 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన స్టార్ హెల్త్ ఇన్ స్టిట్యూట్


ఉద్యోగాల పేరిట 70 లక్షల రూపాయలు వసూలు చేసిన సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టి స్టార్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ సంస్థ 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎంతకూ ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంది. ఉద్యోగాలు కల్పించాలని లేని పక్షంలో తమ డబ్బులు తమకు తిరిగి చెల్లించాలని వారంతా డిమాండ్ చేయడంతో ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు చెల్లించాలని బాధితులు ఆ సంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News