: నయీం సోదరుడి దంపతులను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం సోదరుడు ఫహీం దంపతులను నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఫహీంను, చంచల్ గూడ మహిళా జైలు నుంచి ఫహీం భార్య షాహిన్ ను కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని రేపు సాయంత్రం 5 గంటల వరకు నార్సింగి పోలీసులు విచారించనున్నారు. నయీం సంపాదించిన ఆస్తులు, చేసిన హత్యల గుట్టుమట్లు వీరి నుంచి తెలుసుకోనున్నారు. ఏపీ, చత్తీస్ గఢ్ లలో నయీం సంపాదించిన ఆస్తుల వివరాలు రాబడతారు. అలాగే వీరిని ఆయా ఆస్తుల దగ్గరకు తీసుకెళ్లి విచారించనున్నట్టు కూడా తెలుస్తోంది. కాగా, నయీం ఇంట్లో హత్యకు గురైన అతని బావ నదీం మృతదేహాన్ని షాద్ నగర్ లో దహనం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News