: మధ్యప్రదేశ్ లో ఇకపై ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు


మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ విభాగం వూర్జా వికాస్ నిగమ్ ఎల్ఈడీ విద్యుత్ బల్బులను డిస్కౌంట్ పై ప్రజలకు అందించిన పథకం విజయవంతమైంది. దీని స్ఫూర్తితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ట్యూబ్ లైట్లతో పాటు తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకునే ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోందని రిన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మను శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా, ట్యూబ్ లైట్ల ధర సుమారు రూ.320 నుంచి రూ.1,120 వరకు ఉండనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News