: ఇదే నా చివరి సిరీస్...రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక ఆటగాడు


శ్రీలంక జట్టుకు ఎన్నో విజయాలు అందించిన తిలకరత్నే దిల్షాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీసే తన చివరి వన్డే క్రికెట్ సిరీస్ అని వెల్లడించాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయిన సంగతి తెలిసిందే. 2013లో దిల్షాన్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 1999లో జింబాబ్వేతో జరిగిన వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన దిల్షాన్ జట్టు విజయంలో ఎన్నోసార్లు పాలుపంచుకున్నాడు. 329 వన్డేల్లో 22 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డే కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 161 పరుగులు చేశాడు. బ్యాటింగ్ లో దిల్షాన్ యావరేజ్ 39.26 కాగా, స్ట్రైక్ రేట్ 86.34. బౌలింగ్ లో 106 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆసీస్ తో జరుగుతున్న వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. తొలి వన్డేలో 22 పరుగులు చేసిన దిల్షాన్, రెండో వన్డేలో కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

  • Loading...

More Telugu News