: నిజజీవితంలోనూ నాకు ర్యాగింగ్ తప్పలేదు: సోనాక్షి సిన్హా
గొప్ప నటుడు, రాజకీయవేత్త కూతురిని అయిన తనకు కూడా నిజ జీవితంలో ర్యాగింగ్ తప్పలేదని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పింది. తమిళ చిత్రం ‘మౌనగురు’కి రీమేక్ గా హిందీలో తెరకెక్కిస్తున్న ‘అకీరా’ చిత్రంలో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో తనను ర్యాగింగ్ చేసే విద్యార్థులను, ఆకతాయిలను సోనాక్షి చితక్కొడుతుంటుంది. వచ్చే నెల 2వ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ, ముంబయిలోని శ్రీమతి నాతీభాయ్ దామోదర్ థాకర్సే ఉమన్స్ యూనివర్శిటీలో తాను చదువుకున్నానని, అది అమ్మాయిల కాలేజీ అయినప్పటికీ, వారితో ఫ్రెండ్ షిప్ చేయడం కష్టంగానే ఉండేదని, తనను ర్యాగింగ్ చేసేవారని చెప్పింది. అయితే, తనను ర్యాగింగ్ చేసిన వాళ్లు, తాను ర్యాగింగ్ చేసిన వారందరూ ఇప్పటికీ తన స్నేహితులేనని చెప్పింది. ర్యాగింగ్ అనేది సింపుల్ గా, ఎంజాయ్ చేసేలా ఉండాలి తప్పా, అవరోధాలు సృష్టించేలా ఉండకూడదని సోనాక్షి సిన్హా తన అభిప్రాయం వ్యక్తం చేసింది.