: రాయదుర్గం 'మీ సేవ' కేంద్రం సమీపంలో చిరుతల కలకలం
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోకి చిరుతలు రావడం కలకలం రేపుతోంది. స్థానికులు చిరుతల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. రాయదుర్గం మీ సేవ కేంద్రం సమీపంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. అక్కడి కంపచెట్లలో వాటిని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతలు దాడికి దిగుతాయనే భయంతో ఆ ప్రాంతంలో ఎవరు సంచరించడం లేదు. మరికాసేపట్లో అటవీ అధికారులు అక్కడకు చేరుకొని వాటిని పట్టుకునే ప్రయత్నం చేయనున్నారు.