: మహారాష్ట్రతో ఒప్పందం వల్ల ప్రజలకు మిగిలేది కన్నీరే!: మధుయాష్కీ గౌడ్


మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రజలకు కన్నీరే మిగులుతుందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. ఈ ఒప్పందాల వల్ల కేసీఆర్ కొత్తగా సాధించేదేమీ లేదని ఆయన తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News